వైరల్: ప్రజలను భయపెడుతున్న మంకీ ఫీవర్.. వ్యాధి లక్షణాలు ఇవే..!!
అయితే వీరి యొక్క ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉందంటూ ఇప్పటివరకు ఎలాంటి మరణ కేసులు సీరియస్ కేసులు కూడా నమోదు కాలేదు అంటూ వైద్యులు వెల్లడించారు.. ఈ కేసులు సిద్దాపూర్ ప్రాంతంలోని ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. అయితే అక్కడ ఫారెస్ట్ ప్రాంతం కావడం చేత మంకీ ఫీవర్ ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. జనవరి 16వ తేదీన ఈ కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలియజేశారు. సాధారణంగా కోతుల పైన నివసించేటువంటి పేలు కుట్టడం వల్ల ఈ జ్వరం వ్యాపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.
కోతులలో ఉండేటువంటి పేలు మనుషులను కుట్టడం వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందట. ఈ పేలు పశువులను కుట్టిన ఈ వ్యాధి బారిన పడతాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే అటవీ పరిసర ప్రాంతాలలో నివసించేవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటూ తెలుపుతున్నారు.. ఈ మంకీ ఫీవర్ బారిన పడితే.. మూడు నుంచి ఐదు రోజుల వరకు తీవ్రమైన జ్వరం శరీర నొప్పులు కళ్ళు ఎరబడడం గుజలుబు తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు అంటూ తెలిపారు. ప్రతి ఏడాది కూడా 500 కేసులు నమోదవుతున్నట్లుగా తెలిపారు. ఈ వైరస్ ఎల్లో ఫీవర్ డెంగ్యూ కి కూడా కారణమవుతుందట.