బోటు వెనకాల ఎక్కిన సీ - లయన్.. ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు?

praveen
భూమి మీద ఉండే జంతువులే కాదు సముద్రంలో ఉండే ఎన్నో జంతువులు కూడా ప్రతి విషయంలో ఎంతో తెలివిగా ఆలోచిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాల్ఫిన్లు ఏకంగా మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక మనుషులు చెప్పినట్లుగా ఏ పనైనా చేయడం చేస్తూ ఉంటాయి. అయితే కేవలం డాల్ఫిన్లు మాత్రమే కాదు సి లయన్స్ కూడా ఇక ఇలా ఏకంగా మనుషులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. తమకు కావాల్సిన దానికోసం కమ్యూనికేట్ చేయడం చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక మనుషులను ఆహారం అందించాలి అంటూ అడగడం సీ లయన్స్  కు ఎప్పుడు నుంచో అలవాటు. అయితే ఇక వీటిని కొంతమంది పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే సీ లయన్స్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎంత తెలివిగా వ్యవహరిస్తాయి అన్నదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సముద్రంలో వెళ్తున్న ఒక బోటు వెనుక భాగంలో సీ లయన్ ను మనం గమనించవచ్చు. అయితే బోట్ నడుపుతున్న ఒక వ్యక్తి వైపు ఆ సి లయన్ ఎంతో దీనంగా చూస్తూ ఉంది.

 ఆహారం కావాలి అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మొదట ఒక చేపను దానికి ఆహారంగా ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. అయితే అది తనకు వద్దు.. నాకు పెద్ద చేప కావాలి అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సీ లయన్. దీంతో మరొక పెద్ద చేపను తీసి ఇచ్చాడు. అది చూసి సంతృప్తి పడి నోట కరచుకొని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది సి లయన్. ఇక ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా పెంపుడు కుక్కల్లాగానే సీ లయన్స్ కూడా ఎంతో క్యూట్గా మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నాయి అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: