వైరల్: ఒక్కరోజే 335 కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు..!!

Divya
గత కొద్ది రోజుల నుంచి పలు దేశాలలో అక్కడక్కడ కరోనా కేసులు వినిపిస్తూ ఉన్నాయి దీంతో ప్రజలు మళ్ళీ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఇప్పుడు ఇండియాలో కూడ మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు మొదలవుతున్నాయి..గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు మనదేశంలో నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది.. అంతేకాకుండా కొత్తగా 5 మరణాలు కూడా నమోదు అయినట్టుగా గుర్తించారు.. అయితే ఇందులో 4 గురు కేరళలోనే ఈ వైరస్ ద్వారా మృతి చెందగా. మరొక మృతదేహం మాత్రం ఉత్తరప్రదేశ్ కు చెందిందట.


అయితే ప్రస్తుతం దేశంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 1,701 చేరగా..ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు పైగ దాటిందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు..వీరిలో 4.46 కోట్ల మంది కోలుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలియజేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం చేరుకోక  మరణాల రేట్లు 1.19 శాతంగా ఉందని పేర్కొంది మంత్రుత్వ శాఖ అధికారికంగా వెబ్సైట్లో తెలియజేశారు.. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్ ను అందించినట్లుగా తెలియజేశారు.



 మరోవైపు కేరళలో కొత్త రకం వేరియంట్ JN -1 కేసును  సైతం వైద్యులు గుర్తించారు.. శనివారమే ఈ కేసును గుర్తించడం జరిగిందట.ఇవే లక్షణాలతో ఆదివారం ఓ బాధితుడు మరణించడం జరిగిందట. అయితే JN -1 వేరియంట్ విషయంలో ఎవరు భయపడవద్దని కేరళ ఆరోగ్యం మంత్రి వీణ జార్జ్ తెలియజేయడం జరిగింది..  భారతదేశంతో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో WHO సంస్థ కాస్త ఆందోళన చెందుతున్నట్లుగా తెలియజేశారు. కరోనా ప్రోటో కాల్ ను అనుసరించాలని పలు దేశాలకు సూచనలు ఇస్తున్నట్లుగా తెలియజేసింది. ఇప్పటికే పలుచోట్ల మాస్కులను ధరిస్తున్నారని అన్ని దేశాల వారు బయటకు వెళితే మాస్క్ ధరించాలని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: