వైరల్: అంతరించిపోతున్న అరుదైన కళ.. ఇలాంటి విడ్డూరాలు ఇక చూడలేరు?
ప్రపంచ దేశాలలో భారతదేశంనకు చాలా ప్రత్యేకత కలదు. దానికి ప్రత్యేక జీవన శైలి, భిన్న సంస్కృతులే ముఖ్య కారణం అని సగటు భారతీయునిగా మనకి బాగా తెలుసు. ఇక్కడ విభిన్న మతాలు, అనేక వర్గాలకు చెందిన ప్రజలు కలిసికట్టుగా జీవిస్తుంటారు. అయితే ఒక్కో సందర్భంలో సరదాగా గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువగా కుంటుంబ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కలిగిన మనదేశంలో నేటి రోజుల్లో అందరూ విడిపోతున్నారుగానీ నిన్న మొన్నటితరం మనలా కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా చేదోడువాదోడుగా వుండేవారు.
ఇక కుటుంబం అంతా ఒక్కచోట ఉన్నప్పుడు నిత్యం గొడవలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీరి మధ్య వచ్చే మాటలు ఇప్పటి వారికి అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఉమ్మడి కుటుంబంలో ప్రధానంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా గొడవలు కనిపిస్తూ ఉంటాయి. ఇక అత్తా కోడళ్ల మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుతుందని ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే నేటికాలంలో చాలా మంది పెళ్లయిన కొత్త జంట వేరే ఇంట్లోకాపురం పెడుతుంది. అయితే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ల పరిస్థితి వేరే. వీరి ఒక్కోసారి గొడవలు పడినా.. ఆ తరువాత వెంటనే కలిసిపోతారు. అందుకే మనవాళ్లు తెలివిగా ఎక్కువగా అత్తా కోడళ్ల మధ్య పరిస్థితి ఎలా ఉంటుందో సీరియల్స్ తీసేసి మనమీద వదులుతూ వుంటారు.
ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఇద్దరు వృద్ధులు ముందుగా తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆ తరువాత కొట్టుకునే స్థాయి వరకు కూడా వెళ్లారు. వారు చూడ్డానికి ముసలోళ్లు అయినా గెలవాలన్న తపన ఇద్దరిలో వుండడం మనం గామనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకతను తీసి తన సోషల్ మీడియాలో ఉంచాడు. అయితే నేటి కాలంలో ఇలాంటి సీన్లు తక్కువే అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ ‘కళ అంతరించిపోతుంది’ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ వీడియోను నెటిజనం కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు.