షాక్:భారత్- పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందా..?
ప్రస్తుతం రెండు జట్లు కూడా రెండేసి విజయాలను అందుకొని హ్యాట్రిక్ విజయం పైన ఆత్రుతగా ఉన్నారు. దీంతో ఈ రోజున జరిగే మ్యాచ్ పైన చాలా ఉత్కంఠత నెలకొంది.. అయితే ఈ మ్యాచ్ కు ఇప్పుడు వర్షం ముప్పు ఉందా అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. వన్డేలో భారత్, పాక్ జట్లు మరొకసారి ఢీకొట్టబోతున్నాయి.. శ్రీలంకలో జరిగిన ఆసియన్ కప్ ఈ ఏడాది రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగించినది..
ఈ రోజున అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉందని నివేదికలు తెలుపుతున్నాయి. ఇండియన్ ,పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు గుర్తించారు. మ్యాచ్ ప్రారంభమయ్య సమయానికి ఉష్ణోగ్రత తగ్గుతుందని తేమ బాగా కురుస్తుందని ఆ తర్వాత వాతావరణం చల్లగా ఉండడం జరుగుతుందని పిచ్ నివేదికలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా పేరుపొందిన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని.. ప్రారంభంలో బ్యాటింగ్ బాగా ఉంటే మ్యాచ్ కొనసాగుతూ ఉంటుందని స్పిన్నర్లు సమర్ధవంతంగా రాణిస్తారని.. అంతేకాకుండా మట్టి పిచ్చి బౌన్స్‌తో కూడిన బౌలర్లకు చాలా అనుకూలంగా ఉంటుందట.