ప్రాణాల మీద ఆశలు లేవా బ్రో.. ఇలాంటివి అవసరమా?
పొర పాటున పాము కాటుకి గురైతే నిమిషాల వ్యవధి లోనే ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది దారుణంగా పాములతో ఆటలాడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఇక నేటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది. ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం ఏకంగా పాముతోనే ఆటలు ఆడాడు.
ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న నాగుపాము తోకను పట్టుకున్న ఆ యువకుడు పక్కకు లాక్కొచ్చాడు. అంతటితో దాన్ని వదిలేయకుండా తోకను పట్టుకుని ఏకంగా పాముని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేశాడు. ఏకంగా పాము పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటే.. దాని ముందు కుప్పిగంతులు వేస్తూ విచిత్రంగా ప్రవర్తించాడు ఇక పాము పలుమార్లు దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ యువకుడు దాని నుంచి తప్పించుకుంటూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రాణాల మీద ఆశలు లేవా బ్రో ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు.