చేపను తినబోయిన మొసలి.. చివరికి ఎలా ప్రాణం పోగొట్టుకుందో చూడండి?

praveen
అడవికి రారాజు సింహం అని అంటూ ఉంటారు. అయితే నీటిలో ఉంది అంటే మొసలి ఆ సింహాన్ని సైతం భయపెడుతూ ఉంటుంది. ఎంతటి భారీ జంతువునైనా సరే ఒక్క పట్టు పట్టి ఏకంగా ఆహారంగా మార్చుకోగల బలాన్ని కలిగి ఉంటుంది సింహం. ఈ క్రమంలోనే సింహం జోలికి వెళ్లడానికి ఇక క్రూరమైన జంతువులు సైతం భయపడిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే సింహం నోటికి చిక్కాము అంటే చివరికి ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అనే విషయం క్రూరమైన జంతువులకు కూడా తెలుసు.


 అయితే భారీ జంతువుల పరిస్థితి ఇలా ఉంటే మొసలి నోటికి చిక్కే చేపల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి ముసలి నోటికి చిట్కాయి అంటే చాలు ఇక చేపలకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసినట్లే అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఒక చేపను నోటితో పట్టుకున్న మొసలి చివరికి ప్రాణాలు కోల్పోయింది. అదేంటి మొసలి నోట్లో పట్టుకుంటే చేప కదా ప్రాణాలు కోల్పోవాల్సింది. మొసలి ప్రాణాలు ఎందుకు పోతాయి అని డౌట్ వచ్చింది కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే ఓ నది ఒడ్డున కొన్ని చేపలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి.


 అంతలోనే మొసలికి ఆకలి వేసింది. ఇక మెల్లగా ఆ చేపలను టార్గెట్ చేస్తూ అక్కడికి వచ్చింది మొసలి. దీంతో అక్కడున్న చేపలన్నీ కూడా పారిపోతాయి. అయితే వాటిలో ఒక చేప మాత్రం మొసలికి దొరికిపోతుంది. చేపను మొసలి నోట కరుచుకుంటుంది. కానీ ఆ తర్వాత గిలగిలా కొట్టుకుంటుంది. ఎందుకంటే అది ఎలక్ట్రికల్ ఈల్ చేప. ఈ విషయం తెలియని మొసలి దాన్ని తినేద్దామని గట్టిగా పట్టుకుంటుంది. అయితే ఇక దానిమీద ఏదైనా దాడి చేస్తే శత్రువును కరెంట్ షాక్ తో చంపేస్తే ఈల్ చేప  ముసలిని పట్టుకోగానే వెంటనే పవర్ రిలీజ్ చేస్తుంది. దీంతో ముసలి గిలగిలా కొట్టుకుంటుంది. అయితే ఇలా చాలా సేపు గిలగిలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోతుంది. అయితే ఈ ఘటనలో మొసలి నోట్లో పడిన చేప కూడా చనిపోతుంది అని చెప్పాలి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: