ఏంటీ బ్రో నరాలు కట్టయ్యాయ్.. ఈ వీడియో నిజంగా నిజమేనా?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా పోయింది. ఏదైనా తేడా ఉంది అంటే కేవలం సెలబ్రెటీలకు ఉండే ఒక బ్లూటిక్ మాత్రమే అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఆ బ్లూటిక్ లేకపోయినా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైతే చేయగలుగుతున్నారో సామాన్యులు సైతం అది చేసే అవకాశం అందరికీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే తమకు నచ్చిన్న వీడియోలని నచ్చిన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు నేటిజన్స్. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

 ఇలాంటి వీడియోలు కొన్ని నవ్విస్తే మరికొన్ని మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇంకొన్ని కళ్ళ ముందు వీడియోలో కనిపిస్తున్న అది నిజమా కాదా అని నమ్మలేని కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు చాలానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు అయితే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ప్రమాదకరమైన పాములలో అటు కొండచిలువ మొదటి వరుసలో ఉంటుంది. ఒక్కసారి కొండచిలువ పట్టు బిగించింది అంటే చివరికి ఎంతటి జంతువైనా సరే ప్రాణాలు కోల్పోవాల్సిందే. దానికి ఆహారంగా మారిపోవాల్సిందే.

 అలాంటి ఒక ప్రమాదకరమైన కొండచిలువతో ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా బొమ్మతో ఆడుకున్నట్లుగా ఆడుకుంటున్నాడు. ఆ కొండచిలువ చూడ్డానికి భారీ ఆకారంతో ఉంది. ఆ బుడ్డోడిని లటుక్కున్న మింగేసిన మింగేస్తుంది. కానీ అలాంటి కొండచిలువతో ఆ చిన్నారి సరదాగా ఆడుకుంటున్నాడు. ఆ కొండచిలువ కూడా చిన్నారిపై దాడి చేయకుండా దాని దారిన అది వెళుతుంది. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి బ్రో ఈ వీడియో చూడగానే నరాలు కట్ అయిపోయాయి. ఇది నిజంగా నిజమేన అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: