మొసలితో ఒక ఆటాడుకున్న సింహాలు.. వైరల్ వీడియో?

praveen
అడవుల్లో జంతువుల జీవనశైలి ఎంతో భిన్నంగా ఉంటుంది. కొన్ని జంతువులు బతకాలంటే ప్రాణాలను రక్షించుకోవడం కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. మరికొన్ని జంతువులు బ్రతకాలంటే ప్రాణం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా అడవిలో ప్రతిక్షణం బ్రతుకు పోరాటం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది టూరిస్టులు సఫారీ వాహనాల ద్వారా భయంకరమైన జంతువులకు సైతం దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు తీసి అవి సోషల్ మీడియాలో పెట్టడం చేస్తూ ఉంటారు.


 అయితే ఇలా పర్యటకుల్లాగా సఫారీ వాహనాల్లో జంతువుల దగ్గరికి వెళ్లే అవకాశం లేనివారు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలు చూడటం ద్వారా సంతృప్తి పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇలా అడవిలో జంతువుల వేటకు సంబంధించి చాలానే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే అడవిలో పులి, చిరుత సహ మరికొన్ని రకాల ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న సింహం మాత్రం అడవికి రారాజు అని పేరు సంపాదించుకుంది. ఎందుకంటే సింహం గర్జన వింటేనే అడవిలో ఉన్న మిగతా జంతువులన్ని వణికిపోతూ ఉంటాయి.


 సింహానికి భయపడినట్లుగా.. ఇంకే జంతువుకు కూడా మిగతా జంతువులు భయపడవు అని చెప్పాలి. అందుకే సింహాన్ని రాజు అని అంటూ ఉంటారు. ఒకవేళ సింహం ఒక్కసారి వేటాడాలని ప్రయత్నించింది అంటే.. చాలు వాటి కంటపడ్డ జంతువుకి అదే చివరి రోజు అవుతుంది. ఇక ఇక్కడ సింహాలు ఏకంగా ప్రమాదకరమైన మొసలితో ఒక ఆట ఆడుకున్నాయి. సింహాలు ఉండే చోటుకు వెళ్ళింది మొసలి. వాటి ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించింది. వెంటనే సింహాల గుంపు అక్కడికి చేరుకుంది. ఇక మొసలికి తమ బలాన్ని చూపించడం మొదలుపెట్టాయి సింహాలు. ఈ క్రమంలోనే రెండు వైపులా నుంచి దాడి చేసి మొసలిని సింహాలు తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: