భయానక వీడియో.. 40 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయిన బాలుడు?
ఇటీవల కాలంలో ఎంతోమంది జీవితంలో ప్రతిక్షణం గుర్తుండిపోయే విధంగా ఇక ప్రమాదకరమైన విన్యాసాలు చేయడానికి కూడా సిద్ధపడి పోతున్నారు. ఇలాంటివి చేసి తీపి జ్ఞాపకాలను సంపాదిస్తూ ఉంటే.. కొంతమంది మాత్రం చివరికి ప్రమాదం బారిన పడిపోతున్నారు అని చెప్పాలి. రోప్స్ రాక్ లో ఆరేళ్ల పిల్లాడు ఏకంగా 40 మీటర్ల ఎత్తు నుంచి అమాంత కింద పడిపోయాడు.ఈ వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారగా.. ఇది ఎంతో భయానకంగా ఉంది అని చెప్పాలి. మాంటేరే లోని పండి డోరా అమెజాన్ ఎక్స్పెడిషన్లో ఈ ఘటన జరిగింది. అమెజాన్ ఎక్స్పెడిషన్లో కుటుంబంతో కలిసి అందరూ సరదాగా గడిపేందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే రోప్స్ ర్యాక్ సాహస క్రీడలలో పాల్గొనడానికి పిల్లలు సిద్ధమయ్యారు. ఆరేళ్ల పిల్లాడు ముందుగా రోప్ లో ప్రయాణించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి రోప్ పైకి వెళ్ళాడు. అయితే ఇద్దరు ఒకే చోటుకు రావడంతో పిల్లాడు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ తాడును పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసాడు. కానీ అందరూ చూస్తుండగానే ఒకసారిగా అబ్బాయి కింద పడిపోయాడు. దీంతో అక్కడే ఉండి ఇదంతా వీడియో తీస్తున్న మిగతా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అదృష్టవశాత్తు కింద సరస్సు ఉండడంతో స్వల్ప గాయాలతో బాధితుడు బయటపడగలిగాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.