రన్నింగ్ స్కూటీపై ఈ జంట చేసిన పనికి ఛీ కొట్టాల్సిందే?

Purushottham Vinay
రాజధాని ఢిల్లీ మెట్రోలో కొన్ని డ్యాన్స్ సహా అసభ్యకరమైన వీడియోలు సోషల్‌ మీడియోలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్‌ అయ్యాయి. ఆ వీడియోలపై మెట్రో ప్రయాణికులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అది అలా ఉంటే తాజాగా ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ జంట చేసిన రచ్చ మాములుగా లేదు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.దీనిపై కొందరు నెటిజన్లు ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోలో ఓ యువతి, యువకుడు రద్దీగా ఉన్న రోడ్డుపై టూ వీలర్ పై వెళ్తుండడం మనం గమనించవచ్చు. అయితే ఒక సందర్భంలో స్కూటీ వెనుక సీట్లో కూర్చున్న యువతి.. డ్రైవింగ్‌ చేస్తున్న యువకుడిని కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేసింది.ప్రతిగా డ్రైవింగ్‌ చేస్తున్న ఆ యువకుడు ఆమెను హగ్‌ చేసుకొనేందుకు ప్రయత్నించాడు.ఇక ఈ వీడియోను వెనుక వస్తున్న వాహనదారులు షూట్ చేశారు. ఇంకా ఈ వీడియోను ఓ నెటిజన్ పోస్టు్‌ చేయగా.. బిజీ రోడ్లపై అసభ్యకరంగా, ప్రమాదకరంగా ప్రయాణించడం పట్ల పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.


ఈ వీడియోపై దారుణంగా మిశ్రమ స్పందన వస్తోంది. అలాగే కొందరు ఈ వీడియోపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోడ్డపై వెళ్తున్నప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యమని చెబుతున్నారు. యముడు వారి చుట్టు తిరుగుతున్నాడు. ఎప్పుడైనా తీసుకెళ్లవచ్చు అంటూ ఓ నెటిజన్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. మరొకరు.. 'ఈ కొత్త జనరేషన్‌.. కొత్త సృష్టి' అంటూ కామెంట్‌ చేశారు. 'వాళ్లకు ఢిల్లీ మెట్రోలో చోటు దొరకలేదు' అంటూ సరదాగా మరొ నెటిజన్‌ కామెంట్ చేయడం జరిగింది.అయితే ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈమధ్యే ఇద్దరు అమ్మాయిలు బైక్ స్టంట్‌ చేసేందుకు ప్రయత్నం చేసి చిక్కుకున్నారు. బైక్‌పై ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు కౌగిలించుకోవడం ఇంకా ముద్దులు పెట్టుకున్న వీడియో బాగా వైరల్‌ అయింది. దీనిపైనా చాలామంది నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు వారిద్దరిపై జరిమానాని విధించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: