మనిషి పై.. సింహం భయంకరమైన దాడి.. వైరల్ వీడియో?

praveen
అడవిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహాలు మొదటి వరుసలో ఉంటాయి . అందుకే సింహాన్ని అడవికి రారాజు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక సింహం తన కంటే భారీగా ఉన్నది జంతువులను సైతం ఎంతో అలవోకగా వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది సింహం. ఒక్కసారి సింహం కన్ను పడింది అంటే చాలు దాని పంజా నుంచి తప్పించుకోవడం ఏ జంతువు తరం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఇక అడవుల్లో ఎన్నో క్రూర మృగాలు ఉన్నప్పటికీ అటు సింహం అడవికి రారాజుగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే పెద్ద పెద్ద జంతువులే సింహాల నుంచి తప్పించుకోలేవు. అలాంటిది ఒక మనిషిపై సింహం పంజా విసిరింది అంటే ఇక ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఒక భారీ సింహం మనిషిపై భయంకరమైన రీతిలో దాడి చేసిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. తబా జింపీలో మకరేలే రేడియేటర్ సెంటర్ కు బ్రిటిష్ యజమాని అయిన 67 ఏళ్ల హార్డ్ సింహాల ఎన్క్లోజర్ లోకి ప్రవేశించాడు.

 అయితే ఇక లోపల ఉన్న ఒక సింహం అతని దగ్గరికి వస్తుండగా అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సింహం ఒకసారిగా అతనిపై పంజా విసిరింది. అంతేకాదు అతని తల పట్టుకుని లోపటికి ఈడ్చికేల్లింది. అతను కింద పడిపోయి చలనం లేకుండా ఉన్నాడు. అయినప్పటికీ సింహం అతని వదలకుండా దారుణంగా దాడి చేసింది. మెడ దవడను తీవ్రంగా గాయపరిచింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా కేకలు వేశారు. అయితే ఇక సింహం అక్కడి నుంచి దూరంగా వెళ్లిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే హార్డ్ గాయపడినప్పటికీ చిరునవ్వుతో ఉన్నట్లు వీడియోలో కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లాక కోలుకొని బయటకి వచ్చాడు. ఈ భయనక వీడియో చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: