ఏపీలో అకాల వర్షాలు.. హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ..!!

Divya
గడిచిన కొద్దిరోజులు క్రితం నుంచి ఎక్కువగా ఎండలు విపరీతంగా కాస్తున్నాయి.. దీంతో ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు.. ఈ ఎండకి వడదెబ్బ తగలడం, ఉక్క పోత వంటి.. పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఈ రోజున వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది..

ఈరోజు నుంచి తేలికపాటి వర్షాలు లేదా ఒక మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే బలమైన గాజులతో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతోంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుపుతోంది గరిష్ట ఉష్ణోగ్రతలలో గమనీయమైన మార్పులు కూడా వస్తాయని ఉరుములతో కూడిన మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
ఇక ఆదివారం రోజున తేరికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది అలాగే సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ చాలా తక్కువగా ఎండలు నమోదు అవుతాయని తెలుపుతున్నారు. అలాగే ఈదురు గాలులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు.. ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో వస్తాయట.

తేరికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం.. అలాగే ఈదురు గాలులు కొన్నిచోట్ల వచ్చే అవకాశం ఉంది. సాధారణ కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా ఎండ నమోదు అయ్యా అవకాశం ఉన్నది.. ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో వస్తాయట.
రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు సెంటీగ్రేడ్లు ఎండలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది. ఈదురు గాలులతో వీచే వర్షం ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: