Viral: క్రియేటివిటీ తగలెయ్య.. ఎలా వస్తాయి గురు ఇలాంటి ఐడియాలు?

praveen
సోషల్ మీడియా లో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని నవ్వుని తెప్పిస్తాయి, మరికొన్ని కోపాన్ని కలిగిస్తాయి. కొన్ని ఆశ్చర్యం గా ఉంటే, మరికొన్ని అద్భుతంగా ఉంటాయి. మరి కొన్నిటిని చూసినపుడు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోని మీరు చూసినట్టైతే అసలు అలా ఎలా? అని ముక్కున వేలేసుకోక తప్పదు మీకు. అవును, వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి చూస్తే... వాష్‌రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన హ్యాండ్ డ్రైయర్‌తో ఒక వ్యక్తి తన తలను ఆరబెట్టుకున్న ఘటనని చూడొచ్చు.
సాధారణం గా ఎవరైనా దానితో చేతులను ఆర బెట్టుకుంటారు. ఎందుకంటే దాని కోసమే అది సృష్టించబడింది. కానీ, ఆ హ్యాండ్ డ్రైయర్‌తో హెయిర్ కూడా ఆరబెట్టుకోవచ్చని మనోడు నిరూపించి చూపాడు. కాగా సదరు వీడియో సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో లో, వాష్‌ రూమ్‌లో హ్యాండ్ డ్రైయర్ కింద కూర్చుని దువ్వెన సహాయం తో తన జుట్టును ఆరబెట్టుకున్న విధానాన్ని చూస్తే మీకు నవ్వాగదు. హ్యాండ్ డ్రైయర్‌ను హెయిర్ డ్రైయర్‌గా ఉపయోగించే అతని ట్రిక్ చూసి నెటిజన్లు అవాక్కయిపోతున్నారు.
అవును, "మాకు ఇలాంటి ఐడియాలు రావేంటి?" అని ఒకింత బాధపడుతున్నారు. దీన్నే అవసరాన్ని బట్టి వస్తువులను ఉపయోగించడం అని అంటారని కొందరు సెలవిస్తున్నారు. మీరూ.. ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను ఫిబ్రవరి 2న IPS అధికారి ఆరిఫ్ షేక్ (@arifhs1) ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది కాస్త తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కాసేపటికే దానికి లక్షల్లో వ్యూస్, వేళల్లో లైక్స్ రావడం కొసమెరుపు. ఒక నెటిజన్ దీనిపై స్పందిస్తూ... "మనం భారతీయులం. ఇలాంటివి కనుగొనడంలో మనం ఎప్పుడూ ముందంజలోనే వున్నాం!" అని ఫన్నీగా రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: