వైరల్ : అర్థరాత్రి అడవి మధ్యలో ప్రయాణం.. ఇంతలో కళ్ళముందు భారీ ఆకారం?

praveen
ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా హాట్ టాపిక్ గా పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు అడవుల్లో ఉండే జంతువులకు ఎంతో దగ్గరగా వెళ్లి ఇక తన కెమెరాలలో ఆసక్తికరమైన విషయాలను బంధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. ఇక ఇలాంటి వీడియో ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు  నెటిజన్స్ అందరూ కూడా చూడ్డానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారని చెప్పాలి.

 కేవలం అడవుల్లోకి వెళ్ళినప్పుడే కాదు అడవుల మధ్యలో నుంచి ఉండే రహదారిపై వాహనంపై వెళ్తున్న సమయంలో కూడా ఇక అడవుల్లో ఉండే జంతువులు రోడ్డుపై తారసపడటం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి కారులో అడవి మధ్యలో ఉన్న రహదారి గుండా వెళుతూ ఉన్నాడు. అప్పటికే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎటువైపు నుంచి ఏ జంతువు వస్తుందో అని భయం గానే వాహనాన్ని నడుపుతూ ఉన్నాడు.

 ఇంతలో ఊహించని షాక్. ఏకంగా ఒక భారీ ఆకారం తన కార్ లైట్ ఫోకస్ లో కనిపించింది. మొదట అక్కడ ఉన్నది ఏంటో అతనికి అర్థం కాలేదు. కాస్త దగ్గరికి వెళ్లి చూసె సరికి అక్కడ ఉన్నది ఒక భారీ ఏనుగు తో పాటు దాని పిల్ల అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇలా భారీ ఏనుగు తన బిడ్డతో కలిసి రోడ్డు దాటుతుంది. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఒక్కసారిగా తన కారును అక్కడే ఆపేసాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ తనకు తాను కాస్త ధైర్యం తెచ్చుకొని ఇక ఏనుగులు రోడ్డు దాటిన తర్వాత వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోనే బెంగళూరు దండేలి ప్రాంతంలో వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: