క్రికెట్లో వింత ఫీలింగ్.. చూస్తే నవ్వాగదు?
అయితే సాధారణంగా క్రికెట్లో మెరుపు ఫీల్డింగ్ లాంటివి ఎప్పుడూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏకంగా ప్రత్యర్థుల వికెట్లు తీసేందుకు ఎంతోమంది మెరుపు ఫీల్డింగ్ చేయడమే కాదు అటు ఎంతో వేగంగా త్రో విసిరి వికెట్లను గిరాటం లాంటివి చేస్తూ ఉంటారు. తద్వారా ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను రన్ అవుట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ఇలా రన్ అవుట్ చేయడంలో విఫలం అవుతూ ఉంటారు. అలాగే క్రికెట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు అందరిని కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి.
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి యూట్యూబ్ వేదికగా తెగచక్కర్లు కొడుతూ ఉంది అని చెప్పాలి. సాధారణంగా చివరి బంతికి ఎక్కువ పరుగులు చేయాల్సి వచ్చిన సమయంలో ఇక బ్యాట్ కి బంతి తగలకున్నా సరే ఇక క్రీజ్ లో ఉన్న ఇద్దరు బ్యాట్స్మెన్లు పరుగులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే వారిని నిలువరించడానికి అటు ఫీల్డర్లు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీడియోలో చూసుకుంటే మాత్రం బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు కానీ ఫీల్డర్ల వైఫల్యం కారణంగా బ్యాట్స్మెన్లు బంతి దగ్గరలో ఉన్న సమయంలోనే మూడు పరుగులు తీసేసారు. ఇక ఇది చూసి క్రికెట్లో ఇలాంటి ఫీల్డింగ్ కూడా ఉంటుందా అంటూ ఎంతో మంది నేటిజన్స్ నవ్వుకుంటూ కామెంట్ చేస్తున్నారు.