ఒకే ఒక్క క్షణం.. అంతే.. అతని ప్రాణం పోయింది?
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినది అని చెప్పాలి. కేవలం ఒక్క సెకండ్ కాలంలో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ బాలుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ఆ బాలుడిని అనుకోని ప్రమాదం మృత్యువు ఓడిలోకి చేర్చింది. బస్సు ప్రమాదవశాత్తు గోడ ను ఢీ కొడితే ఆ గోడ ఇక పక్కన నిలబడ్డ ఆ బాలుడు పై పడింది. ఇలా రెప్పపాటు కాలంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు బాలుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా ఇక ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది..
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని పాల్గర్ లో జవహర్ బస్ డిపో వద్ద చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది. బస్సును డ్రైవర్ రివర్స్ లో తీసుకు వస్తున్న సమయంలో అది ప్రమాదవశాత్తు ఇక పక్కనే ఉన్న ఒక గోడకు బలంగా తగిలింది. దీంతో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఆ సమయంలో గోడ పక్కనే బస్సు కోసం వేచి చూస్తున్నాడు బాలుడు. అయితే గోడ ఒక్కసారిగా అతని మీద పడిపోవడంతో శిధిలాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు రక్షించడానికి ప్రయత్నాలు చేసినా ఇక అప్పటికే అతని ప్రాణం పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.