
బాబోయ్.. చూస్తుండగానే.. జింకను మింగేసిన కొండచిలువ?
ఇక ఇలాంటి వీడియోలు చూసి పాముల జీవన శైలి, అవి ఆహారాన్ని సంపాదించుకునే తీరు గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. అయితే ఈ భూమ్మీద ఉన్న పాములలో అటు కొండచిలువ ఎంతో ప్రమాదకరమైనది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకసారి కొండచిలువ దాడి చేసి పట్టు బిగించింది అంటే ఎంతటి బలమైన జంతువు అయినా సరే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. చిన్న చిన్న కొండచిలువల సైతం భారీ జంతువులను అలవోకగా మింగేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఒక కొండచిలువ అందరూ చూస్తుండగానే ఒక భారీ జింకను కేవలం సెకండ్ల వ్యవధిలోనే అలవోకగా మింగేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోని చూసిన నేటిజన్స్ ఒక్కసారిగా అవ్వకపోతున్నారు.. ఇలా వీడియోలో కనిపిస్తున్న కొండచిలువ బర్మీస్ పైతాన్ జాతికి చెందింది అని నేటిజన్ల్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే బర్మీస్ పైతాన్కు అతిపెద్ద కొండచిలువగా పేరు ఉంది. సాధారణంగా చిన్న చిన్న జీవులని ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది ఈ కొండచిలువ. కానీ ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జింక, పందిలాంటి పెద్ద జంతువులను మింగేస్తూ ఉంటుందట.