ఎలుగుబంటి దయా హృదయం.. ఏం చేసిందో చూడండి?

praveen
సాధారణంగా అడవుల్లో ఉండే క్రూర జంతువులలో అటు ఎలుగుబంట్లు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా అడవుల్లో ఉండే క్రూరమృకాలు  కనిపించిన జంతువులనల్లా చంపి తమకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయని చెప్పాలి. ఇక ఎలుగుబంటి సైతం ఎన్నో రకాల పక్షులను చిన్న చిన్న జంతువులను చంపి ఇక కడుపు నింపుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం క్రూర మృగాలుగా పిలవబడే జంతువుల సైతం ఇతర ప్రాణుల విషయంలో కాస్త మానవత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు ఇక క్రూర మృగాలు మనుషుల కంటే ప్రమాదకరమైనవి కావేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనుషులే చిన్నచిన్న కారణాలకు ప్రాణాలు తీసేస్తుంటే అటు క్రూర మృగాలు ఇతర ప్రాణుల విషయంలో మానవత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 సాధారణంగా ఎలుగుబంటి లాంటి క్రూర మృగం ముందు ఏదైనా పక్షి కనిపించింది అంటే చాలు దానిని చంపి చివరికి కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎలుగుబంటి మాత్రం అలా చేయలేదు. ఏకంగా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకి విషయంలో దయా హృదయంతో సహాయం చేసింది ఎలుగుబంటి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ దృశ్యం హంగేరీ లోని బుధాపేస్ట్ జూలో కనిపించింది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక కొలను వద్ద కాకి ఎగురుతూ నీటిలో పడిపోయింది.



 అక్కడే ఓ ఎలుగుబంటు సంచరిస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఇక నీటి నుంచి ఎలా బయటికి రావాలో తెలియక కాకి కాపాడండి అన్నట్లుగా గట్టిగా అరుస్తూ ఉంది. అయితే వెంటనే అక్కడికి వచ్చిన ఒక ఎలుగుబంటి అప్రమత్తమయింది. హమ్మయ్య నాకు ఆహారం దొరికింది అని సంతోష పడలేదు. నీళ్లలో పడి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న కాకిని పట్టుకోవాలని ప్రయత్నించింది. ఇలా నీటిలో నుంచి కాకిని బయటకు తీసిన తర్వాత ప్రాణాలు కాపాడి.. మరోచోటికి ఆహారం కోసం వెళ్ళింది ఎలుగుబంటి. ఇలా ఎలుగుబంటి ఒక కాకి సహాయం చేసిన తీరు చూసి నేటిజన్లు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: