వైరల్ : పులి, ఎలుగుబంటి మధ్య భీకర పోరు.. ఏది గెలిచిందంటే?
ఇక ఇలాంటి వీడియోలు కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఒక అరుదైన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఏకంగా అడవుల్లో ఉండే జంతువుల దగ్గరకు వెళ్లి అడ్వెంచర్ను ఎంజాయ్ చేసే యాత్రికులు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు అన్నది అర్థమవుతుంది. ఈ వీడియోలో చూసుకుంటే ఎలుగుబంటి పులి భీకరమైన పోరు జరిగింది అని చెప్పాలి. సాధారణంగా అటు పులి బలంగా దాడి చేస్తుంది కాబట్టి ఇక వెంటనే ఎలుగుబంటు తోక ముడుచుకుని అక్కడి నుంచి పారిపోతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు అని చెప్పాలి. ఒకవైపు పులి పంజా విసురుతూ మీదికి దూసుకు వస్తున్న సమయంలో మరోవైపు అటు ఎలుగుబంటు మాత్రం ఎక్కడ వెన్ను చూపలేదు. పులితో హోరాహోరీగా పోరాడుతూనే ఉంది అని చెప్పాలి. దీంతో ఎలుగుబంటి ధైర్యం ముందు అటు పులి తోక ముడిచి వెన్ను చూపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలుగుబంటి దాడికి తట్టుకోలేకపోయిన పులి ఇక అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూసి ఎంతోమంది నేటిజన్లు అవాక్కవుతున్నారు.