కప్పకడుపులో మినుగురు పురుగు.. ఎలా మెరుస్తుందో చూడండి?

praveen
సోషల్ మీడియా లో ఎప్పుడూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ గా మారి పోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంటర్నెట్ లోకి వచ్చే కొన్ని వీడియోలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటే మరికొన్ని వీడియోలు సభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇటీవల వెలుగు లోకి వచ్చిన వీడియో కూడా ఇలాంటి కోవకు చెందింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. సాధారణం  గా కప్పలు చిన్నచిన్న కీటకాలను తిని ఇక జీవనం సాగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కప్ప కంటి ముందు ఏదైనా చిన్న కీటకం కనిపించింది అంటే చాలు లటుక్కున నాలుక చాపి నోట్లోకి లాగేస్తూ ఉంటుంది.


 ఇక ఎలాంటి విష పూరితమైన కీటకం అయినా సరే కప్ప నోటిలోకి వెళ్ళింది అంటే చాలు చివరికి ఆహారంగా మారి  పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎప్పటి  లాగానే కప్ప తనదైన శైలిలో నాలుక తో ఒక చిన్న కీటకాన్ని లోపలికి లాగింది. కానీ ఆ తర్వాతే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏకంగా కప్ప కడుపులో నుంచి ఆ చిన్న పురుగు వెలుగులు విరజిమ్మడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మినుగురు పురుగులు ఎంతలా వెలుగులు విరుజిమ్ము తుంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఇలా మినుగురు పురుగులు వెలుగులు విరజిముతున్న సమయం లో అక్కడికి వచ్చిన ఒక కప్ప లటుక్కున  ఒక మిణుగూరు పురుగును మింగేసి కడుపు లో దాచుకుంది. ఇలాంటి సమయం లోనే ఇక ఆ కప్ప కడుపులో ఉన్న మినుగురు పురుగు మళ్లీ వెలుగులు విరజిమడం మొదలుపెట్టింది. ఇక ఈ వెలుగులు ఏకంగా బయటికి కూడా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లోకి వైరల్ గా మారిపోవడంతో ఇది చూస్తున్న ఎంతోమంది అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: