వైరల్ : బురద నీటిలో.. పాము, ముంగిస మధ్య భీకరమైన పోరు?
ఆ రేంజ్ లో ఇక వీటి మధ్య వైరం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. చిరకాల బద్ధ శత్రువులు అంటూ ఉంటారు కదా.. ఇక ఈ రెండు జంతువుల మధ్య ఉన్న జాతి వైరం చూస్తే మాత్రం ఇది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పాము ముంగిస పోట్లాడుకునే వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తే ఎక్కువ మటుకు మాత్రం ముంగిసలు పై చేయి సాధిస్తాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక బీకరమైన పోరుకి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇప్పుడు వరకు నేలపై పాము ముంగిస పోట్లాడుకోవడం చూసాము. కానీ ఈ వీడియోలో చూసుకుంటే మాత్రం ఏకంగా బురద నీటిలో పాము ముంగిస బీకరమైన పోరు కొనసాగించాయి. పాము బుసలు కొడుతూ ముంగిసను కాటు వేయడానికి వస్తున్న సమయంలో తప్పించుకున్న ముంగిస దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బెదిరిపోయిన పాము అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ముంగిస మాత్రం పామును వదలలేదు. ఇక ఈ రెండింటి మధ్య బికరమైన పోరు అటు నేటిజన్స్ దృష్టిని తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి.