వైరల్ : పది అడుగుల శ్వేతనాగు.. చూస్తే అస్సలు నమ్మలేరు?

praveen
సాధారణంగా పాములకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంతే చాలు ఇక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తెగ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. పాములకు సంబంధించిన ఏదైనా వీడియో వచ్చిందంటే చాలు ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి ఆ వీడియో చూడటానికి మొగ్గు చూపుతూ ఉంటారు.. ఇలా ఎందుకో పాములకు సంబంధించిన విషయం అంటే చాలు అందరికీ కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే కొన్ని రకాల పాములు తరచూ ఎక్కడబడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయ్. కానీ మరికొన్ని రకాల పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అలాంటి వాటిలలో శ్వేత నాగూ కూడా ఒకటి.

 అప్పుడెప్పుడో సౌందర్య హీరోయిన్గా నటించిన శ్వేతనాగు సినిమాలో తెల్ల నాగుపామును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటిది నిజంగానే ఉంటుందా అనే అనుమానం కూడా కొంతమందిలో కలిగింది. సాధారణంగా నాగుపాము ఎంత ఉంటుందో అందరికీ తెలుసు.. కానీ ఇటీవల ఏకంగా ఏకంగా 10 అడుగుల శ్వేతనాగు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన నేటిజన్స్ అందరూ  కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

 ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక స్నేక్ క్యాచర్ శ్వేతనాగుని పోలి ఉన్నట్లుగా ఉన్న ఒక తెల్లటి నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక అది ముందు ఉన్న కలుగులో దూరుతూ ఉంది. ఇక కలుగులో దూరిన తర్వాత దాన్ని ఎలాగో బలవంతంగా బయటికి తీసుకొచ్చి పొలంలో వదులుతారు అక్కడున్న వ్యక్తులు. ఆ సమయంలో నీళ్లల్లో ఆ పాము పాకుతూ ముందుకు పోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ వీడియోని చూసి ఇది నిజమా లేకపోతే గ్రాఫిక్స అని నేటిజన్స్ అందరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: