వైరల్ : కోతులు ఎంత దారుణంగా.. దాడి చేశాయో చూడండి?

praveen
ఇటీవల కాలంలో అడవుల్లో ఉండే కోతులన్నీ కూడా జనావాసాల్లో తిరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. మొన్నటి వరకు ఇలా ఇళ్ల మధ్య తిరుగుతూ ఎక్కడైనా ఆహారం కనిపిస్తే కడుపు నింపుకున్న కోతులు ఇక ఇప్పుడు ఏకంగా మనుషులపైనే దౌర్జన్యం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. మనుషులు మా నుంచే పుట్టారు కాబట్టి మేము కూడా మనుషులతోనే కలిసి ఉంటాం అనుకుంటున్నాయో ఏమో కానీ.. ఏకంగా ఎన్నో ఇళ్ల లోకి చొరబడి అందిన కాడికి ఆహారం దోచుకుపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఎవరైనా కోతులను బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తే ఎక్కడ వెనకడుగు వేయకుండా వారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.

 పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. కోతుల దాడిలో ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఇందుకు  సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవల సాయంత్రం సమయంలో ట్యాంకు రోడ్లో ఉన్న ఓ ఇంట్లోకి కోతులు వచ్చాయి.. అక్కడే ఉన్న వృద్ధురాలు మల్లమ్మ ఆ కోతులను తరిమెందుకు ప్రయత్నించింది.. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కోతులు మల్లమ్మ పై దాడికి పాల్పడ్డాయి.

 ఏకంగా ఆమెను కింద పడేసి రౌండ్ ఆఫ్ చేసి దాడి చేయడం మొదలుపెట్టాయి. భయపడి పోయిన సదరు వృద్ధురాలు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు గట్టిగా అరుస్తూ ఆ కోతులను బెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ భయపడని కోతులు కాసేపు అలాగే దాడి చేసేందుకు ప్రయత్నించి చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాయ్. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది అని చెప్పాలి మ్ పెద్దపల్లి జిల్లాలోనే కాదు నిజాంబాద్ జగిత్యాలలో కూడా ఇక ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని అధికారులను విన్నవించుకుంటున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: