వైరల్ : శివుడు ముందు మోకరిల్లిన మేక.. ఎలా ప్రార్థించిందో చూడండి?

praveen
కొన్ని కొన్ని సార్లు జంతువులు అచ్చం మనుషుల్లా గానే ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటాయని చెప్పాలి. హావభావాలు చూపించడం లో లేదా దేవుడిని ప్రార్థించడం విషయం లో కూడా జంతువులు అచ్చం మనుషులను ఫాలో అవుతూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు అందరూ ఆశ్చర్యం లో మునిగి పోతూ ఉంటారు అని చెప్పాలి ఆ జంతువు ఇలా ఎలా చేయగలిగింది అని ఎంతో మంది ఆలోచనలో పడి పోతూ ఉంటారు. ఇక ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేస్తే ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.


 ఇటీవల కాలంలో సమస్యలు వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మనిషి కూడా ఎప్పుడు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. తమ సమస్యలను తీర్చాలని.. సుఖ సంతోషాలను కలిగించాలని.. సిరిసంపదలతో ఆనందంగా ఉండేలా చూడాలని ఇలా ప్రతి మనిషి ఎన్నో రకాల కోరికలను కోరుతూనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు మనిషి గుడికి వెళ్ళినప్పుడు మోకాళ్ళపై కూర్చొనిదేవుడిని ప్రార్థించడం..  లాంటివి ఎన్నోసార్లు చూశాము. కానీ ఇక్కడ ఒక మేక మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఏకంగా శివుడి ఎదుట మోకరిల్లింది.


 అచ్చం మనుషుల లాగానే శివాలయం గర్భగుడి ఎదుట మోకాళ్ళ మీద కూర్చుని తలవంచుకొని ప్రార్థనలు చేసింది. ఈ వీడియో ట్విటర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఆనందేశ్వర మందిరానికి భక్తులతో పాటు ఒక మేక కూడా వచ్చింది. గర్భగుడి ముందు ఇక మోకరిల్లి దేవుడి ప్రార్థనలు చేసింది. ఇక మేక ఇలా చేయడం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. వెంటనే ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇక వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూసి అటు నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: