మార్కెట్లో డాన్స్ చేసిన అందమైన యువతీ.. మందు బాబు ఏం చేశాడంటే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించాలని ఎంతోమంది భావిస్తూ ఉన్నారు. అందుకోసం పడరాన్ని పాట్లు పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది తమలో ఉన్న టాలెంట్ను బయటపెట్టి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదిస్తూ ఉంటే ఇంకొంతమంది జనాలను ఇబ్బంది పెట్టి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించాలని చూస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు ఎక్కడైనా డాన్స్ చేయాలి అంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏదైనా స్నేహితులతో ఉన్నప్పుడు మాత్రమే డాన్స్ చేసేవారు.


 కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఏకంగా పబ్లిక్ ప్లేస్లలో డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇక ఇటీవలే కాలంలో ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాను తెగ ఊపేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇక ఇలా పబ్లిక్ లో డాన్స్ చేసినప్పుడు కొంతమంది న్యూసెన్సులా భావిస్తూ ఉంటే ఇంకొంతమంది మాత్రం కళ్ళప్పగించి ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అంటే.


 ఇక ఇటీవలే ఒక అందమైన యువతి ఎంతో రద్దీగా ఉన్న మార్కెట్లో ఒక పాటపై డాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అని అనుకుంది. సుస్మితసేన్ నటించిన దిల్బర్ సాంగ్ పై హోయలొలికిస్తూ మార్కెట్ ఏరియాలో డాన్స్ చేసింది.  అయితే ఆమె కష్టానికి తగినట్లుగానే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.  కానీ క్రెడిట్ మాత్రం ఆ యువతీకి రాలేదు. ఎందుకంటే ఆ యువతీ డాన్స్ చేస్తుంటే ఒక మందుబాబు ఆమె వెనకాలే వచ్చి ఆమెను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాడు.  దీంతో ఆ యువతీ ఎంత కష్టపడ్డా వీడియోలో హీరో ఎలిమెంట్ గా మారింది మాత్రం ఆ వెనకాల ఉన్న మందుబాబే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: