వైరల్ : ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు?

praveen
సాధారణంగా ప్రపంచ దేశాల మధ్య వలసలు నిత్యకృత్యంగా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒక దేశంలో జీవించే పరిస్థితులు లేనప్పుడు సరైన ఉపాధి దొరకనప్పుడు ఇతర దేశాలకు వలస వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే ఇలా దేశంకాని దేశానికి వెళ్ళినప్పుడు ఊహించని రీతిలో ఎన్నో ఆటుపోట్లు ఇబ్బందులు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  వీటన్నిటినీ ఎదుర్కొని గుండె రాయి చేసుకుని ముందుకు సాగితేనే ఇక ఈ లోకంలో బ్రతకగలుగుతారు అన్నది ఎంతో మంది వలసలు వచ్చిన వారిని చూస్తే అర్థమవుతుంది. కొన్ని సార్లు కనీసం తినడానికి ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.

 కొన్నిసార్లు ఊహించని నష్టాల కారణంగా ప్రియమైన వారిని కోల్పోయే దుస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక వలసదారుల కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయి అన్నదానికి కళ్ళకు కట్టేలా చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది అని చెప్పాలి. సాధారణంగా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు మరణిస్తే ఆ తండ్రికి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

 కన్న కొడుకు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తప్పని పరిస్థితుల్లో ఒక అనాథ శవంలా సముద్రములో పడేయాల్సి వస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. సిరియా దేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు వాళ్లతో కలిసి అక్రమ మార్గంలో యూరప్ కు వెళుతున్నారు. మార్గమధ్యంలో చిన్నారికి దాహం వేసింది. నీళ్ళు కావాలని అడిగాడు. కానీ అతని దాహం తీర్చేందుకు వారి వద్ద నీరు లేదు. బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందు కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి గుండె ఆగినంత పని అయింది. గుండె రాయి చేసుకుని కొడుకు మృతదేహాన్ని గుడ్డలో కట్టి సముద్రంలో పడేసాడు తండ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: