వైరల్ : ఆ ధైర్యం ఏంట్రా బాబు.. చిన్నోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా?

praveen
పెద్దపెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సింది వయసు అనుభవం మాత్రమే కాదు ఆత్మస్థైర్యం మనమీద మనకు నమ్మకం అనే విషయాన్ని నిరూపిస్తూన్నారు ఎంతో మంది వ్యక్తులు.  ఎందుకంటే ఇటీవలికాలంలో కాళ్లు చేతులు అన్ని సరిగ్గా ఉన్నవారే జీవితంలో విఫలం అయ్యాము అని బాధపడి ఒకవైపు దేవుడునీ నిందిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అలాంటిది ఇటీవల కాలంలో మాత్రం పుట్టుకతోనే అవిటి వాళ్ళుగా పుట్టినప్పటికీ దేవుడా మాకు ఎందుకు ఇలా చేశావ్ అని నిందించకుండా ఎంతో కష్టపడుతూ సొంత కాళ్ళ మీద నిలబడుతూ కుటుంబ పోషణ చూసుకుంటు ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు.

 ఇక ఇప్పుడు ఎంతో మందికి పెద్దపెద్ద సమస్యల నుంచి తప్పించుకోవడం కాదు ఏకంగా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఇన్ డైరెక్ట్ గా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఇంతలా అందరిలో స్ఫూర్తి నింపుతుంది ఎవరు గొప్ప వ్యక్తి కాదు ఏకంగా సరిగ్గా పరిగెత్తడం కూడా తెలియని ఒక చిన్నోడు. చిన్నోడు ఏంటి జీవిత సత్యాన్ని అందరికీ నేర్పించడం ఏంటి అని అవాక్కవుతున్నారు కదా. చిన్నోడే కానీ ఏకంగా భారీ కొండ ను సైతం అలవోకగా ఎత్త గలను అనే  ధైర్యాన్ని కలిగి ఉన్న వీరుడు ఈ బుడతడు.

 సాధారణంగా కబడ్డీ ఆడాలి అంటే శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యం. శారీరక దృఢత్వం లేకుండా కబడ్డీ బరిలోకి దిగితే తప్పకుండా గాయాలు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం తన కంటే పెద్దవారితో కబడ్డీ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే  ఒక కుర్రాడు రైడింగ్ చేసేందుకు వచ్చిన సమయంలో కార్నర్లో ఉన్న చిన్నోడు ఏకంగా అతని కాళ్ళు పట్టుకుని టాకిల్ చేశాడు. అతను ముందుకు కదలకుండా కాళ్ళను గట్టిగా అదిమి పెట్టాడు.  ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: