వైరల్ : చెట్టుపై నల్లటి ఆకారం.. ఏంటో చూసి కుక్కలు పరుగో పరుగు?

praveen
ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా ఆఫీసులకు అపార్ట్మెంట్ల కు సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తున్నారు.  కానీ ఒకప్పుడు మాత్రం అసలు సిసలైన కాపలాదారులుగా వీధి కుక్కలకి పేరు ఉండేది.  ఆ వీధిలోకి కొత్తవారు ఎవరైనా వచ్చారు అంటే చాలు ఇక వారిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా వీధికుక్కలు భయపెడుతూ ఉండేవి. అంతలా కాపలా కాస్తూ ఉండేవి అని చెప్పాలి.  ఇప్పటికి కూడా ఎన్నో ప్రాంతాలలో రాత్రి సమయంలో అందరూ నిద్ర పోయిన తర్వాత వీధికుక్కలు ఊరంతా తిరుగుతూ అన్ని పరిసరాలను పరిశీలిస్తూ ఉంటాయి.

 ఇక్కడ కొన్ని వీధికుక్కలు ఇలా రోడ్డుపై వెళ్తున్న సమయంలో వాటికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. అర్దరాత్రి సమయంలో చెట్టు కింద నుంచి వెళుతున్న వీధి కుక్కలకు ఒక్కసారిగా అలికిడి వినిపించింది. ఏంటా అని చూస్తే చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు. కానీ చెట్టుపైన మాత్రం ఏదో నల్లటి ఆకారం కనిపించింది. అక్కడ ఉంది ఏంటో కుక్కలకు అర్థం కాలేదు. దీంతో భయపెట్టేందుకు  మొరగడం ప్రారంభించాయి. అంతలోనే చెట్టు పై నుంచి కిందకు దూసుకు వచ్చింది. ఒక ఆకారం కట్ చేస్తే అక్కడ ఉన్నది చూసి కుక్కలు పరుగులు పెట్టాయి.  చీకట్లో నల్లటి ఆకారం గా కనిపించింది ఏంటో తెలుసా ఏకంగా చిరుతపులి.

 జనావాసాల్లోకి వచ్చిన చిరుతపులి  ఒక చెట్టు ఎక్కి అక్కడ కూర్చుంది. దాడి చేయాలి అని ఫిక్స్ అయ్యింది.. అటు వైపు వెళ్తున్న కుక్కలు చెట్టు మీద ఏదో కనిపించడంతో మొరగటం మొదలు పెట్టాయి. ఇక చిర్రెత్తుకొచ్చిన చిరుతపులి ఒక్కసారిగా చెట్టు మీద నుంచి కిందకు దూకింది. కుక్కలు అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. చిరుతకు వేటాడే మూడ్ లేనట్టు ఉంది. ఆ కుక్కలను చంపకుండా   వదిలిపెట్టింది. పూణే నగర శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. ట్విట్టర్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: