ఒళ్ళు గగుర్పొడిచే ప్రమాదం.. కానీ చిన్న గాయం కూడా కాలేదు?
ముఖ్యంగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలకు కొదవ లేదు అని చెప్పాలి. కొన్ని రోడ్డు ప్రమాదాలు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తే.. మరికొన్ని రోడ్డు ప్రమాదాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు బారినపడిన వారు ఇక ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వీడియో చూస్తున్న వారు అనుకుంటున్న సమయంలో క్షణ కాల వ్యవధిలో చిన్న గాయాలతో బయటపడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో కూడా ఇలాంటి కోవకు చెందినది అని చెప్పాలి.
సాధారణంగా ఎంతోమంది సిగ్నల్ పడక పోయినప్పటికీ నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవైపు వాహనాలు దూసుకు వస్తున్నప్పటికి కూడా వాటికి అడ్డుగా వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక మహిళ వాహనాలు చూసుకోకుండా తన పాటికి తాను రోడ్డు దాటుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కారు ముందు ఉన్న కారును ఢీకొట్టింది. ఒక కారు డివైడర్ వైపు వెళ్లగా మరో కారు దాటుతున్న మహిళను డీకొట్టబోయింది. ఈ వీడియోలో ప్రమాదం చూస్తే దాదాపు ఆ మహిళ బ్రతకడం చాలా కష్టం. కానీ యమ ధర్మరాజు బిజీగా ఉన్నట్టు ఉన్నాడు చిన్న గాయాలతో ఆమె బయటపడింది.