వైరల్ : కోపంతో అతను చేసిన పనికి.. కొద్దిలో ప్రాణాలు పోయేవి?
అయితే కోపం కారణంగా మానవ బంధాలు క్షీణిస్తాయి అని.. కోపంలో కూడా ఎంతో విచక్షణతో ఆలోచించిన వారు గొప్పవారు అవుతారని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే కోపం ఎంత అనర్థానికి కారణమవుతుందో అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కోపంతో సదరు వ్యక్తి చేసిన పని చివరికి అతని ఆస్పత్రి పాలు చేసింది. ఏకంగా ప్రాణం పోయే పరిస్థితిని తీసుకు వచ్చింది.
ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియో లో ఒక వ్యక్తి బాల్కనీలో నుంచి కింద ఉన్న వ్యక్తి తో గొడవ పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎంతో కోపంగా అతన్ని తిడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక అదే కోపంతో గదిలోకి వెళ్లి కొన్ని వస్తువులను తెచ్చి అతని మీదికి విసిరేందుకు ప్రయత్నించాడు. చివరికి కోపంలో అతని మీదికి సామాను విసిరే ప్రయత్నంలో బాల్కనీ లో ఉన్న వ్యక్తి బాలన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. ఇంకేముంది తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు అని చెప్పాలి.