
వైరల్ : కాకి క్యాట్ వాక్.. చూస్తే వావ్ అనాల్సిందే?
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ కేవలం మనుషులు మాత్రమే క్యాట్ వాక్ చేస్తూ ఉంటారు అని అందరికి తెలుసు.. అందమైన అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని అంటూ ఉంటారు ఎంతోమంది. మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా క్యాట్ వాక్ చేస్తాయని ఇప్పటి వరకు కొన్ని వీడియోలు నిరూపించాయి. అయితే జంతువులు మాత్రమే కాదు పక్షులు కూడా ఎంతో అందంగా క్యాట్వాక్ చేస్తాయని చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి అన్నది మాత్రం ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది.
నలుపు రంగుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పక్షి కాకి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇటీవలే ఒక కాకి గోడపై ఎంతో అందమైన క్యాట్ వాక్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు అనే చెప్పాలి. వావ్ కాకి ఎంత అందంగా క్యాట్వాక్ చేసిందో అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒక పిట్ట గోడ పై కాకి క్యాట్ వాక్ చేస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉందో అని మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి.