వైరల్ : హీరోలా ప్రపోజ్ చేయాలనుకున్నాడు.. పాపం నడుం పట్టేసింది?
ఇక్కడ ఓ వ్యక్తి తన ప్రియురాలికి ఎంతో ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. తనని తాను హీరో రేంజ్లో ఊహించుకున్నాడు. కానీ అంతలో ఊహించని ట్విస్ట్. అతని తొడ కండరాలు పట్టి వేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఒక అథ్లెట్ తన గర్ల్ ఫ్రెండ్ కి స్టేడియంలో ప్రపోస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.. అనుకున్నట్లుగానే ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. పెవిలియన్ కి వచ్చిన తర్వాత తన ప్రేయసిని హగ్ చేసుకున్నాడు. చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి మోకాళ్ళపై ప్రపోజ్ చేయాలని భావించాడు. ఇక అనుకున్నట్లుగానే తనను తాను హీరోగా ఫీలయ్యే మోకాళ్ళపై కూర్చున్నాడు. కానీ అతనికి కండరాలు పట్టేసాయి. దీంతో ప్రియురాలి కాళ్ళ దగ్గరే కుప్పకూలిపోయాడు.
ఈ క్రమంలోనే ఇద్దరు సిబ్బంది సహాయంతో తన ప్రేయసికి ఎట్టకేలకు ప్రపోజ్ చేశాడు. తనకు కనీసం నిలబడే శక్తి లేక పోయినప్పటికీ ప్రపోజ్ చేశాడు. దీంతో అతని ప్రేమను ప్రియురాలు యాక్సెప్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లాస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఎంతో మంది నెటిజన్లు పాపం ప్రపోజ్ చేయడానికి ఎన్ని పాట్లు పడుతున్నాడో అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.