ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఎలుగుబంటి ఏం చేసిందంటే?

praveen
సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలల్లో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణకాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాము అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆసక్తికర వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. అయితే నిత్యం వేల సంఖ్యలో వైరల్ గా మారిపోతున్న వీడియోలు నెటిజన్ల  దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో లో కొన్ని నెటిజన్లను భయపడుతూ ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. ఇలా ఇటీవల కాలంలో ఎన్నో రకాల వీడియోలు సంచలనంగా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఏదైనా వీడియోలు సోషల్ మీడియాలో కి వచ్చాయంటే చాలు అవి నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో అయితే ఎన్నో ప్రమాదకరమైన జంతువులు అటు జనావాసాల్లోకి కూడా వస్తూ ఉన్న ఘటనలు చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో ఎన్నో జంతువులు వాహనాలకు అడ్డుగా రావడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. జనావాసాల్లోకి వచ్చిన ఒక ఎలుగుబంటి సంబంధించిన వీడియో ఇది.

 అయితే ఆ అడవి నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి అటుగా వచ్చిన ఓ కారును చూసి భయంతో పరుగులు పెట్టింది. ఇక కార్ కూడా ఆ ఎలుగుబంటి వెంటనే వెళుతూ ఉండటంతో మరింత భయపడిపోయింది. పరుగు వేగాన్ని మరింత పెంచింది. సాధారణంగా అయితే ఎలుగుబంట్లు భారీకాయం ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు పరిగెత్త లేవు. కానీ ఇక్కడ ఎలుగుబంటి మాత్రం భారీకాయం ఉన్నప్పటికీ ప్రాణభయంతో జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోవడంతో ప్రాణభయం అంటే ఇలాగే ఉంటుందేమో అంటూ ఎంతో మంది కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: