వైరల్ : 'విక్రమ్' లో విజయ్ సేతుపతి లెవల్లో ఎంట్రీ?

praveen
సాధారణంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుర పరిచటం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి సన్నివేశాలు నిజజీవితంలో జరగడం మాత్రం అసాధ్యం అని అనుకుంటూ ఉంటారు చాలా మంది జనాలు. కానీ ఇటీవలి కాలంలో సినిమాలు కాదు అంతకు మించి అనే రేంజ్ లోని సినిమాల్లో చూసిన సన్నివేశాల లాంటి ఘటనలు అచ్చంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవలే కమల్హాసన్ హీరోగా ప్రేక్షకుల  ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా లో విజయ్ సేతుపతి  విలన్ పాత్రలో నటించాడు. తన నటన తో ప్రేక్షకులు అందరినీ మెప్పించి అటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

 ఈ క్రమంలోనే సినిమా మొత్తంలో అటు కొన్ని హైలెట్ సీన్స్ తీసుకుంటే అందులో విజయ్ సేతుపతి ఎంట్రీ కూడా ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఇటీవల కాలంలో సిక్స్ ప్యాక్ చూపించడానికే ఎంతో మంది హీరోలు సిగ్గు పడుతుంటే నిర్మొహమాటంగా ఫ్యామిలీ ప్యాక్ తో షర్టు లేకుండా ఆటో లో నుంచి విజయ్ సేతుపతి సాలిడ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఇది అభిమానులందరినీ కూడా తెగ ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే ఇద్దరు యువకులు సరిగా ఇది ట్రై చేద్దాం అనుకున్నారో ఏమో..

 అచ్చంగా ఇలాగే వేగంగా వచ్చి ఆటోను బోల్తా కొట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆటోలో డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకు లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలోనే వేగం ఎక్కువగా ఉండడంతో టర్ను తీసుకునేటప్పుడు అనూహ్యంగా ఆటో బోర్లా పడిపోతుంది. కాగా అందులోని వ్యక్తులు విజయ్ సేతుపతి లాగా ఆటోల నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు.  కానీ ఆ తర్వాత ఏకంగా ఆటోనీ పైనకి లేపేశారు. ఇదంతా అక్కడ పెట్రోల్ బంక్ సిసిటివి ఫుటేజీలో నమోదయింది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: