వైరల్ : ఏంటి బ్రో ఇది.. ఇంత రిస్క్ అవసరమా?

praveen
సాధారణంగా ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి. కొంతమంది జంతువులపై ప్రేమతో తమకు నచ్చిన కుక్కను పిల్లినో పెంచుకుంటూ  ఉంటే మరి కొంతమంది ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా అనుకుంటూ ఇక కుక్క పిల్లలను పెంచడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు సాధారణంగా పెంపుడు జంతువులు అంటే కుక్క, పిల్లి అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఇటీవలి కాలంలో ఎక్కువమంది పెంచుకుంటుంది కూడా ఇలాంటి పెంపుడు జంతువులను అనే చెప్పాలి.

 కానీ కొంతమంది అందరి కంటే కాస్త భిన్నంగా ఉండాలి అనుకుంటారేమో కుక్కలు పిల్లిని కాకుండా ప్రమాదకరమైన  జంతువులనే పెంపుడు జంతువులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అడవుల్లో ఉండే క్రూర మృగాలను ఎంతోమంది పెంపుడు జంతువులుగా మార్చుకుంటూ ఉంటారు. ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది పులులు సింహాలను సైతం పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ వాడితో ప్రత్యేకమైన బంధం  ఏర్పరచుకుంటున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెద్దపెద్ద పాములను సైతం ప్రేమగా పెంచుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం.

 ఇక్కడ ఒక వ్యక్తి మరింత ధైర్యం చేసి ఏకంగా మొసలిని పెంచుకునేందుకు సిద్ధమయ్యాడు.. ఎందుకు సంబంధించిన  వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నీళ్లలో ఉండే ముసలి ని చూస్తే ప్రతి ఒక్కరు భయపడతారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం చిన్న పిల్లాడిని ఆడించినట్లుగా కాళ్ళ సందుల్లో మొసలిని ఉంచుకొని  ఆడిస్తూ ఆహారం అందించాడు. దాని మూతి దగ్గర చేయి పెట్టి మరీ అభినందించడం గమనార్హం. మొసలి కూడా అతనికి ఎలాంటి హాని చేయకుండా మాంసం తినగానే వెంటనే నీళ్ళలో కి వెళ్ళిపోయింది. ఇది చూసిన తర్వాత ఏంటి బ్రో మరి ఇంత రిస్క్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: