తల్లి ప్రేమ అంటే అంతే.. అమేజింగ్ వీడియో?

praveen
తల్లి ప్రేమ ఎంత గొప్పది అనే ఈ విషయాన్ని వర్ణించాలి అనుకుంటే ఎంత గొప్ప పదాలను ఉపయోగించినా తల్లి ప్రేమ ముందు తక్కువ అవుతాయి అని చెప్పాలి.. ఎందుకంటే ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేనంతగా  గొప్పగా తల్లి తన పిల్లలను ప్రేమిస్తూ ఉంటుంది. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులలో కూడా తల్లి ప్రేమ అనేది ఎంతో గొప్ప గానే ఉంటుంది అన్న దానికి నిదర్శనంగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నోరకాల వీడియో వైరల్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్నో జంతువులు తమ పిల్లల విషయంలో తీసుకునే కేరింగ్ వీడియోలలో చూసినప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది.

 సాధారణంగా తల్లి నిద్రిస్తున్న సమయంలో పిల్లలు అక్కడికి వచ్చి ఇక తల్లిని డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటారు లేదా తమను ఆడించాలి అంటూ మారాం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక భారీ సింహం ఆ సింహానికి పుట్టిన చిన్న మృగరాజు కూడా వీడియో లో ఇదే చేశారు అనేది తెలుస్తుంది. సింహం హాయిగా ఒక చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో అక్కడికి వచ్చింది చోటా మృగరాజు.. అమ్మ నన్ను ఆడించు.. నాకు టైం పాస్ కావడం లేదు అన్నట్లుగా తల్లిని బ్రతిమిలాడడం మొదలు పెట్టింది. ఏ ఊరుకో నాన్న హాయిగా పడుకో అంటూ తల్లి తన ఒడిలో చోట మృగరాజును అదుముకుంది.

 ఇక ఆ తర్వాత చోట మృగరాజు తల్లి దగ్గర నుంచి పక్కనే ఆడుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారి పోవడం తో ఇది చూసి ఎంతో మంది మనసు పులకరించి పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తల్లి ప్రేమకు మనుషులు జంతువులు అనే తారతమ్యం ఏంటి ఎప్పటికీ తల్లి ప్రేమ గొప్పదే అని అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతోమంది. ఇక ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్లో పోస్టు చేయగా ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: