చిన్న పడవలో ప్రయాణం.. చుట్టూ వందల మొసళ్ళు.. చివరికి?

praveen
ఈ సృష్టిలో ఉన్న ప్రమాదకరమైన జీవుల లో అటు నీళ్ళలో ఉండే మొసళ్ళు  కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ముసలిని చూసి ప్రతి ఒక్కరు భయపడి పోతుంటారు. నీళ్లలో కనిపించకుండా వచ్చి నక్కినక్కి మరి ఎంతో వేగం గా వేటాడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటుంది మొసలి. ఎక్కడైనా మొసలి ఉంది అని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడి పోతుంటారు అందరూ.  ఈ క్రమంలోనే మొసలి ఎలా వేటాడుతుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే సాధారణం గా నీళ్లలో ఒక మొసలి కనిపించింది అంటేనే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా 100 మొసళ్ళు కనిపించాయి అంటే ఇక ప్రాణం గాల్లో కలిసి పోతుంది అన్న విషయం తెలిసిందే. పడవ పై వెళుతున్న ప్రయాణికుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నీటిలో పడవ పై వెళ్తున్న ఒక ప్రయాణికుడికి ఒకటి కాదు రెండు కాదు వందల మొసళ్ల గుంపు  చుట్టూ కనిపించాయి. అయినప్పటికీ అతను మాత్రం భయపడలేదు. భయపడకుండా పడవను  అలాగే ముందుకు పోనిచ్చాడు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త  ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారి పోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు. వందల మొసళ్లు ఉన్నాయి అని తెలిసినా కూడా అతను ధైర్యంగా పడవను నడిపాడు అంటే అతని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఏ మాత్రం మొసళ్లు దాడి చేసిన పడవ బోల్తాపడే అవ కాశముంది. దీంతో పడవలో ఉన్న వ్యక్తి మొసళ్లకు ఆహారం గా మారే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో కూడా అతడు భయ పడకుండా పడవ నడిపిన తీరు నిజంగా అద్భుతం అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: