యమధర్మరాజు లీవ్ లో ఉన్నాడేమో.. ఆ యువకుడికి ఏం కాలేదు?
ఇక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోవడం ఖాయం అనుకుంటున్న సమయంలో కూడా కేవలం క్షణ కాల వ్యవధిలో మృత్యువు నుంచి తప్పించుకోవడం లాంటివి ఎంతో మంది విషయంలో నిజం అయింది. అయితే ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ షాక్ లో మునిగిపోతున్నారు. ఆ యువకుడికి భూమ్మీద ఇంకా నూకలు తినే భాగ్యం ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే. ఫుల్లుగా వర్షం పడుతుంది. అలాంటి సమయంలోనే ఇక రోడ్ పై వాహనాలు రయ్యి రయ్యి మంటూ దూసుకుపోతున్నాయి. అయితే ఈ వీడియోలో చూసుకుంటే వర్షం కురుస్తున్న సమయంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. కానీ బైక్ స్లిప్ అయి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా ఒక ట్రక్కు వచ్చింది. అయితే కిందపడిన యువకుడు వెనుక నుంచి వస్తున్న ట్రక్ ను గమనించి రెప్పపాటు కాలంలో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీంతో చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు.