వారెవ్వా.. ఏం క్రియేటివిటీ సామీ.. చూస్తే మతిపోవాల్సిందే?

praveen
టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. క్రియేటివిటీని లోపల దాగి ఉంటే ఎలాంటి పనైనా సరికొత్తగా చేయవచ్చు ఇలాంటి మాటలు ఎంతోమంది చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇవి నిజం చేసి చూపిస్తూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సరికొత్త టాలెంట్ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి టాలెంట్ నేటి రోజుల్లో మరుగున పడిపోతుంది. కాగా ఇప్పుడు  వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రతి ఒక్కరిలో నమ్మకం కలుగుతుంది అని చెప్పాలి.  ప్రస్తుతం స్మార్ట్ఫోన్ యుగంలో ఎంతోమంది కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.

 అసమానమైన ప్రతిభను చాటుతూ అందరిని ఔరా అనిపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలా తమ ఆలోచనలతో అద్భుతాలు చేసి ఇక వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక నిత్యం ఏదో ఒక ట్విట్ తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవలే మరో ఆసక్తికర వీడియో ని కూడా పంచుకున్నారు. ఈ వీడియోలో వ్యక్తి ఏకంగా ఇంటి పై కప్పు మీదికి వెళ్లడానికి మెట్లు తయారు చేసిన విధానం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది అనే చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే ఓ బిల్డింగ్ గోడకి ఆనుకుని ఐరన్ రాడ్ లతో  చేసిన ఒక నిర్మాణం ఉంది.

 ముందుగా చూసినప్పుడు అది ఏంటో ఎవరికీ అర్థం కాదు. తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇక ఆ ఐరన్ రాడ్లతో  చేసిన నిర్మాణానికి ఉన్న ఒక లాక్ ఓపెన్ చేయగానే గోడకు ఆనుకొని ఉన్న ఐరన్ రాడ్లు ఒక్కసారిగా మెట్ల గా మారిపోయాయ. ఆ మెట్ల పై  అటూ ఇటూ తిరగడమె కాదు మళ్ళీ వచ్చి ఐరన్ రాడ్ నీ గోడకి పెట్టేసి లాక్ వేసాడు. ఈ వీడియో నెటిజన్లు అందరిని  కూడా ఆశ్చర్యపరుస్తుంది అనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: