అమెరికాలో ఇడ్లీ, దోసలకు వింత పేర్లు..పాపం తెలుగోల్లు..

Satvika
మన తెలుగు వాళ్ళు ఎక్కుడున్నా కూడా వారికి నచ్చిన ఫుడ్ ను అంటే మన దేశంలో దొరికే ఫుడ్ ను ఎక్కువగా ఇష్ట పడతారు..అమెరికా వెళ్ళినా తెలుగు రుచి వెరయా అని పెద్దలు ఊరికే అనలేదు..అందుకే ఈరోజుల్లో అక్కడ కూడా మన ఆహారానికి మంచి డిమాండ్ ఉంటుంది..అయితే, ఈ మధ్య కొన్ని వంటల పేర్లు పూర్తిగా మారిపోయాయి..పూర్తిగా అమెరికన్ భాషలోకి వెళ్ళడంతో చాలా మంది తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు..అలాంటి ఘటన ఇప్పుడు ఎదురైంది..అదేమిటో ఒకసారి చూసెద్దాము..



అమెరికాలోని ఓ భారతీయ రెస్టారెంట్.. ఇడ్లీ ,దోశ, తదితర భారతీయ వంటకాల పేర్లు మార్చేసింది. విదేశీయులకు పరిచయమున్న కొత్త పేర్లతో భారతీయ వంటకాలను సర్వ్ చేస్తోంది..స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. తాము లొట్టలేసుకుంటూ తినే ఆహారానికి పేర్లు మార్చడం భారతీయులకు అస్సలు మింగుడు పడలేదు. నెట్టింట్లో వారు హాహాకారాలు చేస్తున్నారు. ఇదేం చోద్యం.. అంటూ మండిపడుతున్నారు. మా గుండె పగిలిపోయింది అని కొందరు గొల్లు మంటుంటే.. మరి కొందరేమో..అసలు ఇది చట్టబద్ధమైన చర్యేనా అని ప్రశ్నిస్తున్నారు.



అయితే.. రెస్టారెంట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వారూ ఉన్నారు. విదేశీయులకు ఇవేంటో తెలియదు కాబట్టి.. వారికి తెలిసిన పదాలతో భారతీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంతలా ఆ రెస్టారెంట్‌ను వెనకేసుకొచ్చిన వారు కూడా పేరు మార్పు విషయంలో అంగీకరించలేక తటపటాయిస్తున్నారు. ఇక దేశీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టిన మరో రెస్టారెంట్‌లోని మెనూను కూడా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట్లో రచ్చ జరుగుతోంది. ఇక దోశ, ఇడ్లీల కొత్త పేర్లు ఏంటో చూడండి..

సాంబార్ ఇడ్లీ: డంక్డ్‌ రైస్ కేక్ డిలైట్


సాంబార్ వడ: డంక్డ్ డోనట్ డిలైట్
ప్లెయిన్ దోశ: నేకెడ్ క్రెప్స్
మసాలా దోశ: స్మాష్డ్ పొటాటో క్రెప్..! రైస్ కేక్, డోనట్, క్రెప్స్ వంటివి విదేశీయులకు తెలిసిన వంటకాల పేర్లు.
మొత్తానికి ఇవి భలే కొత్తగా ఉన్నాయని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: