హీరో యష్ టాక్సిక్ సినిమాకు షాక్.. టీజర్ పై మహిళా కమిషన్ ఫైర్..?

Divya
కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించారు హీరో యష్. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం అనే చిత్రంలో నటించడమే కాకుండా టాక్సిక్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనగా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రామ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.


గతంలో ఎన్నాడు లేని విధంగా డార్క్ అండ్ బోల్డ్ లుక్ లో యష్ కనిపించేసరికి  అభిమానులు ఆశ్చర్యపరిచేలా చేశారు యష్. టీజర్ లో చూపించిన కొన్ని సీన్స్ కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. లేడీ డైరెక్టర్ అయ్యుండి కూడా ఇంత బోల్డ్ గా ఎలా తీశారు అంటు డైరెక్టర్ గీతూ పైన చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే వాటన్నిటిని డైరెక్టర్ మాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా కారులో చిత్రీకరించిన సీన్స్ చాలా బోల్డ్ గా ఉండడమే కాకుండా, ఇంటిమేట్ సీన్ల పైన నెటిజెన్స్ సైతం విమర్శలు చేస్తున్నారు.


ఇటువంటి తరుణంలోనే కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఈ టీజర్ పైన చాలా అభ్యంతరం వ్యక్తం చేసింది. టీజర్ లో కొన్ని అస్లీల దృశ్యాలు సమాజం పైన తీవ్ర ప్రభావం చూపించేలా ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. వెంటనే ఆ టీజర్ ను సోషల్ మీడియా,  యూట్యూబ్ ఇతర ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలంటు డిమాండ్ చేశారు. వీటి పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా సెన్సార్ బోర్డ్ కి ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం పైన చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఈ విషయం కన్నడ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: