వైరల్ : కుందేలుగా మారిన కుక్క పిల్ల.. చూస్తే నవ్వాగదు?
ఇక ఈ వీడియో చూసిన తర్వాత చిన్న పిల్లలు పెద్దలు అంగీకరించడమే కాదు కుక్క పిల్లలు సైతం తమ దగ్గర ఉన్న ప్రతి దాన్ని కూడా అనుకరిస్తూ ఉంటాయి అనే విషయం అర్థమవుతుంది. రెండు జాతుల మనస్తత్వాలు ఉన్న జంతువులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి కుక్కపిల్ల అయితే మరొకటి కుందేలు. అయితే ఇక కుందేలును చూసిన కుక్కపిల్ల తాను శునకం అనే విషయాన్ని మరిచి పోయింది. దీంతో తన సహజత్వాన్ని మరిచిపోయి ఏకంగా కుందేలు లాగా గెంతటం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.
ముందుగా కుందేలు గెంతుతూ ముందుకు వెళ్లగా ఆ తర్వాత దానిని అనుకరించిన కుక్క పిల్ల అచ్చం అలాగే గెంతింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కుందేలుకు తగిలింది కుక్కపిల్ల. దీంతో భయపడిపోయిన కుందేలు పిల్ల ఒక సారిగా కుక్కపిల్ల పై తిరగబడింది. అయితే ఈ వీడియోలో ముందుగా కుందేలు గెంతుతూ ఉండటాన్ని ఎంతో నిశితంగా గమనించిన కుక్కపిల్ల తనని తాను కుందేలు అనుకున్నట్లుగానే కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఎంతో మంది నెటిజన్లు ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ముఖంపై చిరునవ్వు విరిసేలా చేస్తూ ఉంది ఈ వీడియో.