ఓరినాయనో.. స్టేజ్ మీదే వరుడు ఏం చేసాడో చూడండి?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురానుభూతి అనే విషయం తెలిసిందే. అందుకే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లిని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు.  అందరిలా కాకుండా కాస్త భిన్నంగా సరి కొత్తగా పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటి రోజుల్లో యువత. ఇలా ఏకంగా పెళ్లిళ్లలో వధువు వరుడు డాన్స్ చేస్తూ వస్తున్న వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇలాంటి వీడియోలు చూసి పెళ్లి అంటే ఇంత సంబరంగా ఉంటుందా అని అందరు అనుకునేలోపే.. ఏకంగా స్టేజి మీద వధూవరులు ఇద్దరూ కూడా కొట్టుకుంటున్న వీడియోలు వైరల్ గా మారిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. ఏకంగా అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో కోపంతో ఊగిపోయిన వరుడు వధువుని వెనకనుంచి తలపై ఒక్క పీకు పీకాడు. అంతే అప్పటి వరకు ఎంతో సంబరంగా ఉన్న పెళ్లి మండపం కాస్తా ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఉన్న వారెవ్వరికి కూడా అర్థం కాలేదు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వరుడికి దీవెనలు ఇవ్వకపోగా.. ఏకంగా తిట్ల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.. ఇంతకీ అలా స్టేజి మీదే వరుడు వధువును కొట్టడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు కదా..

 ఇంతకీ ఏం జరిగింది అంటే సాధారణంగా పెళ్లిళ్లు జరిగినప్పుడు స్నేహితులు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఆటపట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు.  రకరకాల గేమ్ ఆడిస్తూ ఉంటారు.  ఇక్కడ కొత్త జంటకు ఒక టాస్క్ ఇచ్చారు స్నేహితులు. ఇక ఆ టాస్క్ లో వధువు గెలిచింది. అయితే భార్య గెలవడాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు వరుడు. కోపంతో ఒక్కసారిగా ఊగిపోయి వధువును తలపై చాచి పెట్టి ఒక్కటిచ్చాడు. దీంతో అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ మారగా.. అతన్ని చూసి తిట్ల వర్షం కురిపిస్తున్నారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: