వైరల్ : 6 గురు అబ్బాయిలను చితక్కొట్టిన అమ్మాయి?

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేల మంది కాదు లక్షలాది మంది మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు ఆడపిల్ల కనిపించింది అంటే చాలా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక  ఎక్కడైనా ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అటు ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది అనేది మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు అడ్డుకునేందుకు  ఆడ పిల్లలు సిద్ధంగా ఉండాలని ఇటీవల కాలంలో పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

 ఆకతాయిల  నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు పోలీసులు. దీంతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్నది ఇక్కడ వీడియో చూస్తే అర్థమవుతుంది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని దాదాపు నలుగురు అబ్బాయిలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి వేధించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక్కసారిగా భయపడిపోయిన ఆడపిల్ల ఆ తర్వాత మాత్రం ధైర్యసాహసాలను ప్రదర్శించింది. ఏకంగా తన ముందు ఉన్నది అబ్బాయిలు అని కూడా చూడకుండా ఆరుగురు అబ్బాయిలను చితకబాదింది.

 ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక అమ్మాయి తనను వేధిస్తున్న ఆకతాయిల కు సరైన బుద్ధి చెప్పింది అంటూ ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇలా కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఆరుగురు అబ్బాయిలను కూడా చితక్కొట్టుడు కొట్టింది ఆ అమ్మాయి.. ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఒక వ్యక్తి అమ్మాయిలతో గొడవ పెట్టుకోకండి అంటూ ఒక క్యాప్షన్ ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: