Viral : నిరుద్యోగులకు కేంద్రం నుంచి రూ.6000/- నిరుద్యోగభృతి?

Purushottham Vinay
మన భారత దేశంలో అన్నిటికంటే కూడా ప్రధానంగా వున్న సమస్య ఏంటంటే నిరుద్యోగం. దేశంలో కొన్ని లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగం సమస్యతో చాలా ఎక్కువగా బాధ పడుతున్నారు.అయితే నిరుద్యోగుల కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త లాంటి న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక అదేంటంటే..ఇక ప్రధాన్ మంత్రి బేరోజ్‌గర్ భట్టా యోజన’ కింద నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నెలవారీ రూ. 6,000 ఆర్ధిక సహాయం అందిస్తోందని అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మరీ ముఖ్యంగా వాట్సాప్‌లో ఒక వార్త చాలా బాగా వైరల్ అవుతోంది.ఇక ఆ వార్తలలో ఎముందంటే.. దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వచ్చేసి ప్రతి నెలకు కూడా రూ.6,000 ఇవ్వనుంది. ‘ప్రధాన్ మంత్రి బెరోజ్‌గర్ భట్టా యోజన 2022’ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది, అలాగే దీని కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 6,000 లభిస్తుంది.


అయితే, ఇక ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ నివేదికపై వాస్తవ తనిఖీని నిర్వహించడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం అసలు అటువంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని తేలింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్ ని ఏదీ అమలు చేయడం లేదని ఇంకా అసలు ఇలాంటి తప్పుడు వార్తలను  ప్రజలు అస్సలు నమ్మవద్దని పీఐబీ కోరింది.ఇక ఈ ఫేక్ న్యూస్‌ను వ్యతిరేకిస్తూ, పిఐబి సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ లో ఇలా రాసింది.కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 6000 వరకు నిరుద్యోగ భృతిని అందజేస్తోందని ఒక సందేశంలో క్లెయిమ్ చేయబడింది. #PIBFactCheck ప్రకారం ఇది పక్కా ఫేక్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అసలు అలాంటి ప్రకటన చేయలేదు..ఇక ఏదైనా చేసినా కూడా అధికారికంగా ప్రకటిస్తుంది.దయచేసి ఇలాంటి వాటిని అస్సలు నమ్మకండి అని సూచించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: