వైరల్ వీడియో : బైక్ లోకి పాము ఎలా దూరిందో చూడండి?

praveen
చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ధైర్యవంతులం అని చెప్పుకునే వారిని సైతం ఎంతగానో భయపెట్టే జీవి పాము. అడవుల్లో కొండ ప్రాంతాల్లో పొలం గట్ల పైన ఎక్కువగా పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఒక్కసారి కళ్ళముందు పాము కనిపించింది అంటే చాలు గుండెజారి పోయినంత పని అయిపోతుంది. ఇక మన కళ్ళముందే ఉంది విషపూరితమైన పాము అని తెలిస్తే అందరూ మరింత వణికిపోతుంటారు. ఇక ఆ పాము మన వైపే వస్తూ ఉంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగోపరుగు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు.


 అయితే ఒకప్పుడు కేవలం అడవుల్లో మాత్రమే పాములు ఎక్కువగా  కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో అడవులను నరికి అక్కడ జనావాసాలు కూడా నిర్మించుకుంటున్నారు. దీంతో మిగతా జంతువులు లాగే అటు పాములు కూడా జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వస్తూ ఉండటంతో ఎంతోమంది భయాందోళనకు గురవుతున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. ఇలా జనావాసాల్లోకి రావడమే కాదు మనుషులు వాడే వస్తువులలో పాములు నక్కి దాక్కుని ఉన్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో గత కొంత కాలం నుంచి వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోని సోషల్ మీడియాను ఊపేస్తుంది. కొన్నిసార్లు బయట విడిచే షూలలో కూడా దూరి పోతూ ఉంటాయి పాములు. ఇటీవలే ఒక నాగుపాము ఏకంగా బైక్ లోకి దూరి ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఇది గమనించిన బైక్ యజమాని ఇక బైక్ తీసుకొని బయటకు బయల్దేరాడు. ఇంతలోనే పాము బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ బైక్ తీస్తుండగా పాము కనిపించింది.  దీంతో అక్కడే బైక్ వదిలిపెట్టాడు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించి అతని సహాయంతో పామును బయటకు తీయించారు  అయితే బైక్ లోకి పాము ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు సదరు వ్యక్తి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: