వైరల్ : వరుడి చంప పగలగొట్టిన వధువు?

frame వైరల్ : వరుడి చంప పగలగొట్టిన వధువు?

praveen
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది.. సోషల్ మీడియా పుణ్యమా అని అన్ని క్షణాల్లో తెలిసిపోతున్నాయి. దీంతో దేశంలో కాదు కాదు ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన ఘటనలు కూడా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతున్నాయి. అయితే ఇలా ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా అందరి లాగానే పెళ్లి జరిగింది అంటే పెద్దగాఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఆ పెళ్లి లో ఏదైనా విచిత్రంగా కొత్తగా జరిగిందంటే మాత్రంఇక సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోని వైరల్ గా మార్చుతూ ఉన్నారు.



 అయితే కొన్ని కొన్ని సార్లు పెద్దలు ఒత్తిడి కారణంగా యువతీ యువకులు తమకు ఇష్టం లేని పెళ్లి చేసు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఏకంగా పెళ్లి స్టేజి మీద గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోయాయి. ఏకంగా వధువు వరుడి పై చేయి చేసుకోవడం లేదా వరుడు వధువుని స్టేజ్ మీద కొట్టడం లాంటి వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్థాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా స్టేజ్ మీద దండలు మార్చుకుంటున్న సమయంలో వధువు వరుడి చెంప పగులగొట్టింది.


 ఇక వధువు ఇలా స్పందించడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్న కారణంగా అప్పటికే కోపంతో ఉంది యువతి. ఈ క్రమంలోనే వరుడు వధువు మెడలో దండ వేయబోయాడు. ఇంతలో ఏకంగా యువతి అనూహ్యంగా స్పందించింది. ముందు నిలబడి ఉన్న వరుడిని నాలుగు సార్లు చెంప వాయించింది. ఆ తర్వాత కోపంగా చూస్తూ స్టేజీ దిగి వెళ్ళిపోయింది. దీంతో పెళ్లికూతురు బిహేవియర్ తో ఒక్క సారిగా షాక్ అయిన బంధువులు అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త  వైరల్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని హామీమ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: