అవ్వ పై ప్రేమను ఛాటుకున్న వానరం..వైరల్..
తాజాగా మరో వీడియో అందరినీ ఆష్చర్యానికి గురి చెస్తుంది.. ఓ వానరం ఓ వృద్ధురాలు పై ప్రేమను చాటుకుంది. అది చూసిన అందరు నోర్లు వెల్లబెడుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, మొత్తానికి కోతి, అవ్వ ల వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ పెద్ద కోతి ఇంటిలోకి రావడమే కాక, ముసలావిడ పైకి ఎక్కి కూర్చుంది. అంతేకాదు అవ్వ పై ఎక్కి ఆమెను ప్రేమగా దగ్గర తీసుకొని కౌగిలించుకుని హక్కున చెర్చుకుంది. తన బిడ్డను దగ్గరకు తీసుకున్న విధంగా ఆమె కూడా కోతి ని హక్కున చెర్చుకుంది.
అవ్వ మాత్రం కోతి చూసి నవ్వుతూ చాలా సంతోషంగా కనిపిస్తోంది. అయితే ముసలి అవ్వపై కూర్చున్న కోతి మాత్రం ఆమెను కౌగిలించుకుని, కాసేపు పక్కనే కూర్చుని వెళ్ళిపోయింది..ఆమె పక్కనే ఉన్న మరో మహిళ మాత్రం కోతి కి దండం పెట్టింది. మామూలు రొజుల్లొ అవ్వ రోజూ కోతికి రెండు రొట్టెలు ఇచ్చేదని తర్వాత ఎవరూ కోతి బాధను పట్టించుకోలేదు. అవ్వకు ఏమైందో తెలుసుకునేందుకు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన కోతికి అవ్వ అనారోగ్యంతో మంచంలో పడుకొని కనిపించింది. అంతే వెంటనే మంచంపైకి ఎక్కి అవ్వను కౌగిలించుకుంది. అవ్వ ఆరోగ్యం బాగుందని తెలుసుకొని కోతి వెళ్ళి పోయింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది..