దున్నపోతుతో యవ్వారం ఇలాగే ఉంటుంది.. ఏం జరిగిందో చూడండి?
సాధారణంగా ఇప్పటివరకూ ఎంతోమంది ఎద్దుల బండి లో వెళ్లడం చూసాము లేదా గుర్రపు బండిలో వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు మాత్రం కాస్త కొత్తగా ట్రై చేశారు.. ఒక దున్నపోతును కట్టి ఇక ఆ బండిలో ప్రయత్నించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఇక దున్నపోతును కొడుతూ బండి మీద కూర్చుని తెగ ఎంజాయ్ చేశారు. కానీ అంతలోనే కర్మ సిద్ధాంతం వారి విషయంలో నిజం అయ్యింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడ్డారు అందరూ.. దీనికి సంబంధించిన వీడియోలు భారత అటవీ శాఖాధికారీ పర్వీన్ కాస్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
రోడ్డుపై వెళ్తున్న బైక్ కార్ల కు పోటీగా ఇక దున్నపోతు ను బండి కట్టి వేగంగా వెళ్లాలనుకునీ దారుణంగా కొట్టారు కొంతమంది వ్యక్తులు. అక్కడే కథ అడ్డం తిరిగింది. దున్నపోతు కోపంతో ఒక్కసారిగా కుడి వైపుకు తిరిగింది. దీంతో బండి చక్రాలలో ఒకటి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బండి మీద ఉన్న ఐదుగురు వ్యక్తులు కూడా అమాంతం గాల్లోకి ఎగిరి పడ్డా రు. ఈ క్రమంలోనే ఎంతో మందికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే ఇది జరిగిందా లేదా అని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు చాలామంది. ఒకరికి కీడు తల పెడితే మనకి కూడా కీడు జరుగుతుంది అన్న దానికి ఈ ఘటన మాత్రం నిదర్శనంగా మారిపోయింది.